Monday, November 18, 2024

బిజెపి ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించ‌డం ప్రారంభ‌మైది.. దీనికోసం బిజెపి కార్యాల‌యంలో ప్ర‌త్యేక డెస్క్ ను ఏర్పాటు చేశారు.. ఇక . అయితే ఆ దరఖాస్తులను ఏదో షరా మాము లుగా కాకుండా పకడ్బంధీ ఫార్మాట్‌లో స్వీకరించ‌నున్నారు.. దరఖాస్తులో అభ్యర్థులు పలు అంశాల తాలుకూ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. బీజేపీలో ఎంత కాలం నుంచి ఉన్నారు..?, పార్టీలో ఏమైనా బాధ్యతలు, పదవిని నిర్వహిస్తు న్నారా..?, ఎమ్మెల్యే, ఎంపీగా కాకుండా ప్రజాప్ర తినిధిగా ఇతర బాధ్యతలు ఏమైనా నిర్వహిస్తు న్నారా..?, గతంలో ఏ పార్టీలో ఉన్నారు..?, ఎమ్మె ల్యేగా కాని, ఎంపీగా కాని పోటీ చేశారా..?, చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేశారు..?, ఎన్ని ఓట్లు సాధించారు..?, ప్రజా సమస్యల పై పోరాటాలు నిర్వహించిన అనుభవం ఉందా..?, ఉంటే వాటా తాలూకు పేపర్‌ కటింగులు, ఫోటోలు ఉన్నాయా..?, క్రిమిన‌ల్, ఇత‌ర కేసులు ఉన్నాయా ఇలా ఆశావహ అభ్యర్థికి చెందిన పూర్తి సమాచారాన్ని రాబట్టేలా దరఖాస్తు ఫార్మాట్‌ను బీజేపీ సిద్ధం చేసింది.

అయితే ఎలాంటి దరఖాస్తు రుసుము లేకపోవడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు బీజేపీ పెద్దలు. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక స్క్రూట్నీ కమిటీని కూడా పార్టీ ఏర్పాటు చేసింది. ఎక్కెడెక్కడ బీజేపీ బలంగా ఉందో, గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల నుంచి భారీగా అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్య ర్థుల ఎంపిక విషయంలో విధివిధానాల రూపకల్పన ప్రక్రియను దరఖాస్తుల విధానం సులువు చేస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేందుకు బీజేపీ ఏర్పాట్లు- చేసుకుంటోంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement