హైదరాబాద్ – తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో… బీజేపీతో సఖ్యత కుదిరితే తెలంగాణలో జనసేనాని వారాహి యాత్రకు తన రథాన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు గా ఎన్నికల్లో శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల కాలం తరుముతుంటే.. . ఓ వైపు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూనే.. తమతో కలిసే జతగాళ్లతో పొత్తుల ప్రయత్నం చేస్తున్నాయి.ఇప్పటికే తామూ కలిసి పోటీ చేయాలని బీజేపీ, జనసేన నిర్ణయించుకున్నాయి..
తాజాగా.. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై అమిత్ షాతో చర్చించారు. పవన్ కల్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇప్పటికే.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. జనసేనకు కేటాయించే సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే, పొత్తుల విషయం తేలగానే తెలంగాణాలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపడుతారని జనసేన, బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తోంది..