అటవీ ప్రాంతాల్లో పక్షుల జీవితాలు ఎలా మిళితమయ్యాయో, వాటి జీవిత విషయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ అవకాశం కల్పిస్తుంంది. ఇందుకోసం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్‌ను అటవీ శాఖ నిర్వహించనుంది. ఈనెల 8,9 తేదీల్లో జరగనున్న రెండవ వార్షిక బర్డ్ వాక్‌లో దేశ విదేశాలకు నుంచి పక్షి ప్రేమికులు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాపర్లు, విద్యార్ధులు హాజరుకానున్నారు. ఈ బర్డ్ వాక్‌లో పాల్గొనే వీక్షకులు దాదాపు 21 అటవీ ప్రదేశాల్లో అరుదైన పక్షులను తిలకించే అవకాశం ఉంది. కొమురం భీమ్ ఆసీఫాబాద్ జిల్లా పెంచికల్ పేట, కాగజ్‌నగర్, బెజ్జూర్, కొమరంభీమ్ ప్రాజెక్టు, పాలరాపు రాబంధు క్లిఫ్, తిర్యాణిలోని గుండాల, సహా అనేక నీటి వనరులు పక్షులను ఆకర్షిస్తున్నాయి.
తొలిసారిగా 2019లో అటవీ శాఖ నిర్వహించిన బర్డ్ వాక్ ఫెస్టివల్‌కు పక్షుల ప్రేమికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 273 రకాల కొత్త పక్షి జాతులను గుర్తించారు. ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించనున్న బర్డ్ వాక్‌లో పాల్గొనేందుకు ఏడవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనిలో పాల్గొనేందుకు ఒక్కరి చొప్పున రూ.2000 వేలు రుసం చెల్లించాలని, వాహన, రాత్రికి బస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఫారెస్టు అధికారి 9440810099, ఎఫ్‌డివో 95025 00496, అలాగే కాగజ్‌నగర్ ఎఫ్‌ఆర్వో 6304895189, సిర్పూర్‌ఎఫ్‌ఆర్వో 99511 25470, పెంచికల్ పేటఎఫ్‌ఆర్వో 97018 27688, బెజ్జూర్ ఎఫ్‌ఆర్వో 7989825925 ను సంప్రదించాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
అరుదైన పక్షులకు నిలయం అదిలాబాద్ అడవులు..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల అడవులు ఎన్నో పక్షులకు ఆలవాలంగా ఉంది. అయోరా, ఇండియన్ ప్యారడైజ్డు ఫ్లైక్యాచర్ బర్డ్, లిటిల్ ఫ్లై క్యాచర్ బర్డ్, రింగ్‌రోజ్ ప్యారాకిట్, చాంగ్‌బుక్ హాక్, కింగ్ ఫిషర్, గిజ్‌గాడ్, తోకల పిట్టలు ఉన్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతాల్లో వీటి సంతతి అధికంగా ఉంది. ప్రధానంగా కొమరం భీం జిల్లాలో పక్షలకు కావల్సిన ఆహారం, సౌకర్యం ఉండటంతో తమ సంతతిని ఇక్కడే వృద్ధి చేసుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital