ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంబించిన బండి సంజయ్ ఆ తర్వాత బిజెపిలో అంచలంచెలా ఎదిగారు.. పార్టీకి వీర విదేయుడుగా ఉన్న సంజయ్ ఫ్రధాని మోదీ 3.0 కెబినెట్ లో తొలిసారి కేంద్ర మంత్రి పదవి పొందారు.. 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన సంజయ్ 2024 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది. కేంద్ర కేబినెట్ లో బండి సంజయ్ కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని బండి సంజయ్ తల్లి శకుంతల పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో చాలా తక్కువగా గడిపేవారని తెలిపారు. ప్రజా సమస్యల పై ఎన్నో సార్లు జైల్ కు వెళ్లారని గుర్తు చేసుకున్నారు.
బండి బయోడేటా….
పుట్టిన తేదీ : 11-7-1971
తండ్రి : కీ.శే. బండి నర్సయ్య
తల్లి : శకుంతల.
అక్క :శైలజ
అన్నలు : బండి శ్రవణ్ కుమార్, బండి సంపత్ కుమార్
భార్య: బండి అపర్ణ, ఎస్.బి.ఐ. ఉద్యోగిని
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
కులము: (బి.సి-‘డిస)- మున్నూరుకాపు
ప్రస్తుత బాధ్యతలు : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి.
రాజకీయ ప్రస్థానం..
- బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..
- అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..
- ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా..
- బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా
- భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధ గా కూడా పని చేశారు.
- ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా
- కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా ఎన్నిక, అదే డివిజన్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు.
- వరుసుగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బిజెపి అధ్యక్షునిగా.
- 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు.
- 2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు.
- 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి, టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
- 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం,
- 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం,
- 2019 టొబాకో బోర్డు మెంబెర్ గా నియామకం,
- 2019 మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా నియామకం,
- 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకం,
- 2020 బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం.
- 2023 BJP జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకం.
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు.
- 2024 జాతీయ కిసాన్ మోర్చ ఇంఛార్జి గా నియామకం.
- 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగాట ఓట్ల మెజారిటీతో గెలుపు.