2023లో హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన లోగోను మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్ కలిసి ఆవిష్కరించారు. అడ్వాన్సింగ్ ఫర్ వన్ – షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యుమనైన్జడ్ హెల్త్ కేర్ అనే థీమ్‌తో బయో ఆసియా సదస్సు 20వ ఎడిషన్ జరగనుంది. కొవిడ్ కారణంగా గతేడాది బయో ఆసియా సదస్సు వర్చువల్ విధానంలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచం సాధారణ స్థితిలోకి వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖుల సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమష్టి అవకాశాలపై పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విధాన నిర్ణేతలు చర్చించే ప్రపంచ స్థాయి సదస్సుగా కొన్నేళ్లుగా బయో ఆసియా గుర్తింపు పొందిందని తెలిపారు.