Saturday, November 23, 2024

దోషుల విడుద‌ల‌పై స్పందించండి-జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌కి లేఖ రాసిన ఎమ్మెల్సీ క‌విత‌

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌కి ఓ లేఖ రాశారు టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. బిల్కిస్ బానోపై అ‌త్యాచారం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె 5 నెల‌ల గర్భిణీ అన్న విష‌యాన్ని త‌న లేఖ‌లో ప్ర‌స్తావించిన క‌విత‌… ఈ కేసులో దోషుల విడుద‌ల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందించాల‌ని, దేశ ప్ర‌జ‌ల్లో న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఇనుమ‌డింప‌జేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆమె జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను కోరారు.కాగా సంచ‌ల‌నం రేకెత్తించిన బిల్కిస్ బానో కేసు వ్య‌వ‌హారంలో దోషుల విడుద‌ల‌పై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఈ కేసులో దోషులు బ్రాహ్మ‌ణులు అని, సంస్కార‌వంతులు అని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లపై విమర్శ‌లు రేకెత్తాయి. అంతేకాకుండా దోషుల విడుద‌ల చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement