జనగామ క్రైమ్, ( ప్రభ న్యూస్ ) :జనగామ జిల్లాలో వరుసగా దేవాలయాల బైక్ చోరీలకు పాల్పడుతున్న నేరస్తుల మూటను అరెస్ట్ చేసినట్లు జనగామ డి.సి.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లా శివంపేట్ శాబ్ పల్లి కి చెందిన జోడు ప్రశాంత్,చాపల సంజీవ్ ను అరెస్ట్ చేసి 6 ద్విచక్ర వాహనములు, 65,897 రూపాయలు, బంగారు, వెండి అబరణాలు స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
నేరస్తులు ఇంతకుముందు కూడా దొంగతనము కేసులలోపడి ఆక్ట్ కింద జైల్ జీవితం గడిపి వచ్చినా కూడా మార్పు చెందకుండా స్నేహితులతో కల్సీ జల్సాలకు అలవాటుపడ్డారు, వరుస దొంగతనాలు చేసి అట్టి డబ్బులతో జల్సాలు చేయాలని ఉద్దేశంతో, గ్రామ పట్టణ శివారులోని దేవాలయాలను మరియు ఇండ్ల బయట పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి, దొంగిలించి అలాగే దేవాలయాలలో దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నారు అని తెలిపారు.
వరుస చోరీలకు పాల్పడుతూ గత కొద్ది రోజులుగా తప్పించుక తిరుగుతున్న నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేసిన కేయూసి పిఎస్, జనగామ పిఎస్ పోలీసు ఆద్వర్యములో టీమ్ ఏర్పాటు చేయగా మరలా దొంగతనము చేయాలని ఉద్దేశముతో బచ్చన్నపేటమీదుగా వస్తుండగా చాకచక్యంగా పట్టుకోవడం జరగింది అని తెలిపారు.
నేరస్తులను పట్టుకున్న జనగామ సిఐ బి. బాలాజీ వర ప్రసాద్, గారి ఆద్వర్యంలో టీమ్ హెడ్ కానిస్టేబుల్ కే. రవిందర్ రెడ్డి, టి. కృష్ణ, కే. మాహేష్, టి. రామన్న. కేయూసి పిఎస్ నుండి సహకరించిన కానిస్టేబుల్ ఎం. నర్సయ్య, జే. మోహన్లను జనగామ డిసిపి బి.స్రినివాస రెడ్డి, జనగామ ఏసిపి. జి, కృష్ణ, అబినంధిచారు.