నిజాంబాద్ జిల్లాలోని ఇందల్ వాయి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.. ఇందల్ వాయి మండల కేంద్రం లో హైవే 44 పై నిర్మించిన బ్రిడ్జి పై అగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన పాల్సార్ బైక్ ఢీకొంది. . దీంతో బైక్ పైన ప్రయాణిస్తున్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్సా నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా దేగవత్ రాము (23) మార్గమధ్యంలో మృతి చెందగా మరో ఈద్దరు భాదవత్ ప్రవీణ్. భాడవాత్ నితిన్ తీవ్ర గాయాల పాలయ్యారు..వారిని చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు..