జన్నారం, నవంబర్ 27 (ఆంధ్రప్రభ) : మండలంలోని మొర్రిగూడ గ్రామ సమీపాన ఉన్న ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్ వలసకూలీ తాగుడుకు బానిసై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన సింటుకుమార్ (22)గత వారం రోజుల క్రితం ఆ రైస్ మిల్లులో పనిచేయడానికి వచ్చి కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు.
అయితే సింటుకుమార్ తన అన్న కమల్ పాస్వన్ కు ఫోన్ చేసి తనకు కూలీపని చేయడం చేతకావడం లేదని, తనకు జీవితంపై విరక్తి కలుగుతుందని గత రాత్రి రైస్ మిల్ సమీపాన ఉన్న పల్లె ప్రకృతి వనం గేటుకు టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని అన్న కమల్ పాస్వన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు. పంచనామా అనంతరం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని అన్నకు అప్పగించామన్నారు.