పెద్దకొత్తపల్లి ప్రభ న్యూస్: ఎండిన గంజాయిని పొట్లాలు కట్టి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రూప్ లాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు మాట్లాడుతూ.. మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ సమీపంలోని కె ఎల్ ఐ మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ .. ఎస్సై ఇబ్రహీం రాజా సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు పని చేస్తూ ఉండడంతో అక్కడ తనిఖీలు చేపట్టగా వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే రూప్ లాల్ ఎండిన గంజాయి తీసుకువచ్చి పొట్లాలు కట్టి విక్రయిస్తున్నట్లు తేలింది. గ్రామాలలో గంజాయి మొక్కలను పెంచే వ్యక్తులు.. విక్రయించే వ్యక్తులు.. కొనుగోలు చేసే వ్యక్తుల పేర్ల సమాచారాన్ని నాగర్ కర్నూలు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ పరమేష్ గౌడ్9440410004, కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు9440902616 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లను రహస్యంగా ఉంచబడతాయి సూచించారు. గ్రామాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మత్తుపదార్థాల వంటి గంజాయి నాటుసారా ఎవరైనా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement