బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు ప్రశాంత్ ను పోలీసులు తరలించారు. ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడికి రిమాండ్ విధించారు.
రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్, మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అతని కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్టు చేశామని అన్నారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీరాన్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రశాంత్ ను మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా.. 14రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిపారు.