Tuesday, November 12, 2024

Bigala vs Dhanpal – సవాల్ కు సై..స్థలం ఎక్కడో నిర్ణయించి చెప్తే.. సింగిల్ గానే వస్తా

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)10: నిజామాబాద్ అర్బన్ బీఆర్ ఎస్ అభ్యర్థి గణేష్ గుప్త విసి రిన సవాల్ కు సై… అని ఈ నెల 13న ఉదయం 10 గంట లకు బహిరంగ చర్చకు సిద్ధ మని అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ తెలిపారు. స్థలం ఎక్కడో నిర్ణయించి చెప్తే.. సింగిల్ గా వస్తానని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ని మొత్తం కబ్జాలు, కమీషన్లు, అవినీతి, దౌర్జన్యాలు, మాఫి యాకు అడ్డాగా మార్చాడని విమర్శించారు. గణేష్ గుప్త కబ్జాల గురిం చి మాట్లాడితే దయ్యాలు వేదా లు వల్లించి నట్లు ఉందన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల బీజేపీ జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేక ర్ల సమావేశంలో ధన్ పాల్ మాట్లాడారు. గణేష్ గుప్తకు ఓటమి భయం పట్టుకుందని,. నామినేషన్ ర్యాలీని చూసి దిమ్మతిరిగి సోయి తప్పి మాట్లా డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల మద్దతు బీజేపీకే…సేవే మా పరమావధి….

తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాలనలో మార్పు కోరుతు న్నారు… స్వచ్ఛందంగా బిజెపి అభ్యర్థులకు భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఉన్నారని బిజెపి అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత కొన్ని సంవత్సరాల క్రితం ట్రస్టుని ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలుగా నిజాంబాద్ అర్బన్ ప్రజలకు సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాదు నగరం లోని 21వ డివిజన్ లోనీ ఎల్లమ్మ గుట్ట లో బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనా రాయణ ప్రచారం నిర్వహిం చారు.

ఈ సందర్బంగా దంపాల్ మాట్లాడుతూ నగర ప్రజలంతా కమలం పువ్వు కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనుసును గెలుచు కుందన్నారు. అన్ని పార్టీ లకు అవకాశం ఇచ్చారు ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇవ్వాలని కోరారు. నా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశానని చెప్పారు. నా ట్రస్ట్ ద్వారా కుల మతాల కు అతీతంగా సేవ కార్యక్రమాలు చేశానని అన్నా రు. నిజామబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమం లో 21 వ డివిజన్ ఇంచార్జి దొంతుల రవి, 20 వ డివిజన్ కార్పొ రేటర్ న్యాలం రాజు, పంచారెడ్డి లావణ్య లింగం, పంచారెడ్డి ప్రవళిక, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,sc మోర్చా అధ్యక్షులు BR శివ ప్రసాద్, మైనార్టీ అధ్యక్షులు కైసార్, డివిజన్ నాయకులు, బిట్టు, రాజేందర్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement