Friday, November 22, 2024

Big story : నిధులున్నా…లేకున్నా ఉద్యోగుల వేతనాలే తొలి ప్రాధాన్యత..

-రూ. 4వేల కోట్లు వీటికే
-ఆ తర్వాతే మిగతా కార్యాచరణ
-పూర్తిస్థాయిలో ఖజానాకు చేరని పన్నుల ఆదాయం
-10లోగా అన్ని జిల్లాల్లో చెల్లింపులకు యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్రం ఇచ్చిన అడ్‌హక్‌(తాత్కాలిక) అప్పుల అనుమతి సర్కార్‌కు పెద్దగా ఆశాజనకంగా ఉండబోదని ఆర్థిక శాఖ చెబుతోంది. నిధుల సమీకరణకు అంతర్గతంగా అనేక కష్టాలున్నప్పటికీ ఉద్యోగుల వేతనాలకు జాప్యం కావొద్దని సీఎం కేసీఆర్‌ ఆర్ధిక శాఖను ఆదేశించినట్లు తెలిసింది. అవసరమైతే ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను నిలివేసి అయినా సరే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అరకొరతగా ఉన్న నిధులను సర్దుబాటు చేసుకుంటూ తొలి ప్రాధాన్యతగా ఉద్యోగుల వేతనాలు, రిటైర్డు ఉద్యోగుల పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ నెల 7న ఆర్భీఐ అనుమతించిన రుణ సమీకరణతో తాత్కాలిక ఉపశమనం మినహా పూర్తిస్థాయిలో కేంద్రంనుంచి తెలంగాణకు అనుమతులు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రూ. 52 వేల కోట్ల రుణ సమీకరణపై కేంద్రం ఇంకా ఎటువంటి స్పష్టతనివ్వలేదని ఆర్ధిక శాఖ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రంగా నివేదిక అందించినప్పటికీ సంతృప్తి చెందలేదని, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలపైనే పేచీ పెడుతోందని తెలుస్తోంది. ఇలా ఈ ఏడాది రూ.

15వేల కోట్ల గ్యారంటీ రుణాలపై తాత్సారం నెలకొన్నది. ఈ అప్పుల సమీకరణకు కేంద్రం అనుమతించబోదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక వ్యయాలపై ప్రభావం నమోదు కానుంది. ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ తెలంగాణ సర్కార్‌ తొలి ప్రాధాన్యత వేతనాల చెల్లింపులకేనని చెబుతోంది. ఈ నేపథ్యంలో వేతనాలకు నిధులను రెడీ చేసింది. ఆ తర్వాత వరుస క్రమంలో సంక్షేమ పథకాలకు చెల్లింపుల దిశగా సిద్ధమవుతున్నది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాల చెల్లింపుల్లో ఉన్న సంక్లిష్టతలను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేతనాల బిల్లులకు ఆన్‌లైన్‌ విధానంలో ట్రెజరీలు జీతాలను ఖాతాల్లో జమచేస్తున్నాయి. పేపర్‌ బిల్లులను పూర్తిగా నిలుపుదల చేస్తూ ఆర్బీఐకి ప్రభుత్వం సమాచారమిచ్చింది. పేపర్‌ టూ ఫాలో విధానం రద్దు చేసి డిజిటల్‌ చెక్‌ విధానాలను అవంభించాలని ఆదేశించింది. దీంతో నేరుగా ఉద్యోగుల ఖాతాలకు వేతనాలు జమ చేసేలా ఆర్ధిక శాఖ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆరంభమైన వేతనాల చెల్లింపులు ఈనెల 10లోగా పెన్షనర్లుకు, ఇతర జీతభత్యాలను పూర్తిచేసేలా ఆర్ధిక శాఖ కృషి చేస్తోంది. డైరెక్టర్‌ ట్రెజరీస్‌ను ఈ మేరకు ఆదేశిస్తూ పలు మినహాయింపులను నిర్ధేశించింది. డిజిటల్‌ చెక్కులను ఈ కుబేర్‌ విధానంలో స్వీకరిస్తున్నారు. గతంలో ఉన్న క్రాస్‌ చెక్‌ విధానాన్ని తొలగించి ప్రతీ ఉద్యోగి ఖాతాకే వేతనం నగదు చేరనుంది. ఇప్పటివరకు నెల మొదటి పనిదినంనాడే రిజర్వ్‌బ్యాంకు ద్వారా ఉద్యోగులకు నేరుగా వారి ఖాతాల్లో వేతనాలను జమ చేస్తున్న ప్రభుత్వం చెల్లింపుల్లో మరింత సరళ విధానాలను అవలంభిస్తోంది. గతంలో ఉన్న అనేక అవరోధాలను అధిగమించేందుకు ఆధునిక పారదర్శక విధానాలను అందుబాటులోకి తెస్తూ ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్‌గా తెలంగాణ ప్రభుత్వం ఖ్యాతిగడిస్తోంది.

ఈ మేరకు ఖజానా శాఖ కాగిత రహిత సేవలను ఆమలులోకి తేవడంద్వారా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఐఎఫ్‌ఎంఐఎన్‌ పోర్టల్‌ను అందుబాటులో తెచ్చింది. ఇందులో శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియతో బిల్లుల సమర్పణ, చెల్లింపులవంటి అన్ని వివరాలు ఉండనున్నాయి. జిల్లాల్లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన కాగిత బిల్లులను కార్యాలయాల్లో అందజేస్తేనే ఈ కుబేర్‌ విధానంలో వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ కుబేర్‌ రాక తర్వాత ప్రతీనెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న నూతన పోర్టల్‌తో కాగిత రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కాగిత బిల్లుల అంశం పూర్తిగా కనుమరుగు కానుంది. రాష్ట్రంలోని 4 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాగిత బిల్లులతో పనిలేకుండా పోనున్నది. కొత్త పోర్టల్‌ అందుబాటుతో జిల్లాల్లో ఖజానా కార్యాలయాలకు పూర్తిగా పేపర్‌లెస్‌ పాలన అందుబాటులోకి రానున్నది. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్‌ అధికారులకు కొత్త పోర్టల్‌ లాగిన్‌ సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నెలలోనే పూర్తిస్థాయిలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను నమోదు చేసి వచ్చే నెలనుంచి పేపర్‌లెస్‌ బిల్లులద్వారా ఆన్‌లైన్‌ వ…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement