తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కి బిగ్ షాక్ తగిలినట్లైంది. ఆపార్టీకి చెందిన మేనిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీలు బీజేపీకి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాసేపట్లో నోవాటెల్ హోటల్ లో ఉన్న రాహుల్ గాంధీ వద్దకు వెళ్లనున్నారు.
- Advertisement -