Monday, October 21, 2024

Big Relief – రియ‌ల్ వెంచ‌ర్ల‌కు అన్ని అనుమతులు ఉంటే కూల్చబోం – హైడ్రా భరోసా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:హైడ్రా విషయంలో హైద‌రాబాద్‌ నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చట్టబద్దమైన అన్ని అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్భావన యాత్రలో మాట్లాడుతూ హైడ్రా విషయాన్ని ప్రస్తావించిన విష‌యాన్ని తెలిపారు. చెల్లుబాటు అయ్యే అన్ని అనుమతులున్న నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లబోద‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని, ఆ ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ ట్విట్ట‌ర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.

సీఎం ప్రసంగం వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. హైడ్రా విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement