హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. అజహరుద్దీన్‌కు మల్కాజిగిరికోర్టు ముందస్తు బెయిల్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు చెందిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజహరుద్దీన్ తోపాటు మరికొంత మందిపై నాలుగు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అజహరుద్దీన్ మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు.
ఉప్పల్ స్టేడియంలో జిమ్ తోపాటు బంతుల కొనుగోలు, కుర్చీల ఏర్పాటులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో వాస్తవం లేదని అజహరుద్దీన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న కోర్టు.. అజహరుద్దీన్‌కు 41ఏ నోటీసులిచ్చి ప్రశ్నించాలని ఉప్పల్ పోలీసులను ఆదేశించింది. అజహరుద్దీన్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అజారుద్దీన్ కు ఊరట లభించినట్లయింది