Friday, September 13, 2024

Big Breaking – ఎమ్మెల్సీ కవితకు బెయిల్

ష‌రతుల‌తో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
10 ల‌క్షల విలువైన షూరిటీ స‌మ‌ర్పించాలి.
కేసుపై మీడియా ముందు మౌన‌ముద్ర‌
పాస్ పోర్టు స‌రేండ‌ర్ చేయాల్సిందే
మార్చి 15న క‌విత అరెస్ట్
ఇప్ప‌టి వ‌ర‌కు తిహార్ జైలులోనే
ఈడీ, సిఐడిల‌ విచార‌ణ పూర్తి
అందుకే క‌విత బెయిల్ మంజూరు చేశామ‌న్న ధ‌ర్మాసనం

న్యూఢిల్లీ -లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు నేడు బెయిల్ లభించింది.. సుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.

ఫైన‌ల్ జ‌డ్జిమెంట్….

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

షరతులు ఇవే…

- Advertisement -

కవితకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. కేసు గురించి మీడియా ముందు ప్ర‌స్తావించ కూడ‌ద‌ని, సాక్షులను ప్రభావితం చేయ‌కూడ‌ద‌ని ష‌ర‌తులు విధించింది. అలాగే సంబంధిత అధికారుల‌కు కవిత పాస్‌పోర్ట్‌ను అప్పగించాల‌ని సూచించింది.

వాదోపవాదాలు…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు.
ఇప్ప‌టికే కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.

కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్‌ గ్రూప్‌ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.

దీనిపై ఈడీ న్యాయ‌వాదిఎస్వీ రాజు త‌న వాద‌న‌ను వినిపిస్తూ, కవిత దర్యాప్తుకు సహకరించడం లేద‌న్నారు.అయితే నేరం జరిగింది అనడానికి ఆధారం ఏముందని ను అడిగింది ధర్మాసనం .కవితను రెండేళ్లుగా వాడిన మొబైల్ ఫోన్ల ను అడిగామ‌ని,
కవిత వాటిని ఇచ్చార‌ని తెలిపారు .అయితే మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేసారా..డేటా డిలీట్ చేసారా అని అడిగామ‌ని, అందుకు క‌విత త‌న‌కు తెలీదు అన్న సమాధానాలు ఇచ్చార‌న్నారు న్యాయ‌వాది. ఈడీ కవితను అడిగిన ప్రశ్నలు..కవిత ఇచ్చిన సమాధానాలను కోర్టుకు తెలిపిన ఎస్వీ రాజు

కవిత సమాజ సేవలో ఉన్నారని, విద్యార్హతలు..సమాజంలో వారి కుటుంబానికి గుర్తింపు ఉంద‌న్న సుప్రీంకోర్టు వ్యాఖ్యాల‌కు అడ్డుప‌డిన న్యాయ‌వాది వ్యక్తి గత హోదా ను బెట్టి బెయిల్ మంజూరు చేయ‌డం కుద‌ర‌ద‌న్నారు.. కైమ్ డేటా రికార్డులో నిందితులతో జరిపిన చాటింగ్స్ ఉన్నాయని ప్ర‌స్తావించారు . బుచ్చిబాబు ,అభిషేక్ బోయినపల్లితో జరిపిన చాట్స్ గురించి తనకు తెలియదని కవిత చెప్పార‌న్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి,శరత్ చంద్రా రెడ్డి నుంచి నిధులను సమకూర్చి కవిత ఆప్ కి అందజేశార‌ని వాదించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను కలిసిన తరువాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్లి కవితను కలిశార‌న్నారు.. కేసులో కవిత పాత్ర గురించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేజ్రీవాల్ తదితరులు చెప్పిన అంశాల గురించి వివరించారు. దీనిపై ముకుల్‌ రోహత్గీ కౌంట‌ర్ ఇస్తూ, కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు. ఇప్ప‌టికే విచార‌ణ పూర్తి కావ‌డంతో బెయిల్ ఇవ్వాల్సిందేన‌ని ముకుల్ ధ‌ర్మాస‌నాన్ని కోరారు..

ఇది అరెస్ట్ ప్రస్థానం .

ఈ ఏడాది మార్చి 15న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్‌ వారెంట్‌తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహాడ్‌ జైలుకు తరలించారు.

ఇదీ నేపథ్యం

డిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్‌ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్‌ రామచంద్రపిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్‌ గ్రూప్‌ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్‌కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్‌ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది. నేడు బెయిల్ రావడంతో కవిత జైలు నుంచి నేడే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement