Thursday, November 21, 2024

TS : కాంగ్రెస్ చేతికి చిక్కిన భువ‌న‌గిరి, నేరేడుచ‌ర్ల మునిసిపాలిటీలు …

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని భువ‌న‌గిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీ లు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. నేరేడుచ‌ర్ల మునిసిప‌ల్ ఛైర్మ‌న్ పై కాంగ్రెస్ నేడు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. నేడు దీనిపై ఓటింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా మున్సిపాలిటీ చైర్మన్ విజయ బాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అలాగే అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు హాజరుకాలేదు.ఇక 13 కౌన్సిల్ సభ్యులతో అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు.

దీంతో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోనున్నారు.
భువ‌న‌గిరిలో కూడా…
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు టు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు తీర్మానికి గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకాకుండానే అవిశ్వాసం నెగ్గారు. దీంతో ఈ మునిసిపాలిటీల‌లో కూడా కాంగ్రెస్ పాగా వేయ‌నుంది. త్వరలో ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement