73వ గణతంత్ర వేడుకలను బుధవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఎగురవేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్ గౌడ్, పరమేశ్వర్ రెడ్డి, జనగాం పాండు, నిర్మల, బీరుమల్లయ్య, అబ్బగాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.