హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయడిపన బాధితులను కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చి వేరెందుకు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ట్రాలీని లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు హాస్పిటల్ లో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు ఎంజిఎం మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంజీఎంలో క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు మైనింగ్ సేవ్ నిధుల నుండి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని, వారి పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఇసుక రవాణా చేసే లారీలు వెళ్లడం వాళ్ళనే ప్రమాదాలు జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తూ కూర్చోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.