Friday, January 10, 2025

Bhubharati Act ‍ ‍ – భూ భార‌తి బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర‌…

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది.

గ‌వ‌ర్నర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి న‌వీన్ మిట్టల్ అంద‌జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు, రైతులు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోన్నారు .

- Advertisement -

ఈ చ‌ట్టం తీసుకువచ్చి మూడు సంవత్స‌రాలు గ‌డ‌చినా కూడా విధివిధానాల‌ను రూపొందించ‌లేదు. భూ స‌మ‌స్య‌లేని గ్రామం తెలంగాణ‌లో లేదు. గ‌త ప్ర‌భుత్వం త‌మ వ్య‌క్తిగ‌త స్వార్ధం కోసం ప్ర‌యోజ‌నాల కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది . గ్రామాల‌లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌డానికి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని ఇందుకు సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కివ‌చ్చింది.


ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది.ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌నిచేయాలి, రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌. ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లు కేంద్ర‌బిందువుగా మా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్ర‌జ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేయాలి అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement