Saturday, December 28, 2024

Bhu Bharathi – రైతు నెత్తిన డిజిటల్ స‌ర్వే పిడుగు … రైత‌న్న‌ల‌కు పెనుభార‌మంటున్న కెటిఆర్

భూభార‌తి రిజిస్ట్రేష‌న్ లో కొత్త నింబంధ‌న‌
రైత‌న్న‌ల‌కు పెనుభార‌మంటున్న కెటిఆర్
స‌ర్వేయ‌ర్ల చేయి త‌డ‌పాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్న మాజీ మంత్రి

హైద‌రాబాద్ – భూమి అమ్మాలన్నా, కొనాలన్నా డిజిటల్‌ సర్వే తప్పనిసరిగా చేయాల‌నే నిబంధ‌న రైతుల పాలిటి పిడుగేన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు . భూ భార‌తిలో చేర్చిన కొత్త నిబంధ‌న‌తో భూమిని డిజిట‌ల్ విధానంలో సర్వేయర్‌ కొలిచి మ్యాప్‌ ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేస్తారని చెప్పారు. ఆ బాధ్యతంతా రైతుదేనని కొత్త చట్టంలో నిబంధన పెట్టడంతో పెను సమస్యగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. మండలాల్లో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, తాజా నిబంధనతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లూ గగనమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 250 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, సర్వేయర్లు కొరత తీవ్రంగా ఉండగా, వారి డిమాండ్‌ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం ఉందని ఆరోపించారు . అదనపు చార్జీ చెల్లించినా.. చేయితడపక తప్పని స్థితి తలెత్తనుందని, సర్వేతో నష్టాలు, కష్టాలు తప్పవన్నారు. సర్వే కోసం రైతు అదనంగా ఫీజు చెల్లించాలని, సర్వే చేయాలని అధికారులను బతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కొలతలు, మ్యాప్‌ వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌ జరగదని, సర్వే తర్వాత ఎంతోకొంత ముట్టజెప్పాల్సి వస్తుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు కెటిఆర్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement