హైదరాబాద్ – మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -