Friday, November 22, 2024

Bhodan : ఎమ్మెల్యే షకీల్ పై హత్యాయత్నం కేసు.. ఇద్దరికి రిమాండ్

బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై హత్యాయత్నం కేసులో.. ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు రిమాండ్ అయ్యారు. శుక్రవారం బోధన్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యేని స్థానిక ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. బోధనలో జరుగుతున్న అభివృద్ధిపై, డబుల్ బెడ్ రూమ్ ల‌పై ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బిఆర్ స్ , ఎంఐఎం నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా పోలీస్ స్టేషన్ లో తనపై హత్యాయత్నం జరిగిందని బోధన్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అల్తాఫ్, నవీదు ఇద్దరూ ఎంఐఎం కౌన్సిలర్లతో పాటుగా మరో ఎనిమిది మంది ఎంఐఎం నాయకులు పై 307,324,341,R/W 34IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం ఇద్దరూ ఎంఐఎం కౌన్సిలర్లను అరెస్ట్ చేసిన పోలీసులు నిజామాబాద్ లో జుడిషియల్ సెకండ్ క్లాస్ రైల్వే మేజిస్ట్రేట్ సిరాజుద్దీన్ ఇంటిలో హాజరు పరిచారు. వీరికి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గౌతంనగర్ లోని జడ్జి ఇంటి వద్దకి ఎంఐఎం నాయకులు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement