Friday, November 22, 2024

Bhimpur – అమ్మో పులి…. భయాందోళనలో ప్రజలు

భీంపుర్.మండలం లోని పిప్పల్ కొటి తంశీ కే గొల్ల గట్ సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది గత వారం రోజుల క్రితం పిప్పల్ కోటి గ్రామ సమీప అటవీ ప్రాంతాలలో ఆవుల మంద పై దాడి చేసి ఆవును చంపింది అలాగే గత రెండు రోజుల క్రితం తాంసి కే గ్రామా సమీప అటవీ ప్రాంతంలో మేతమేస్తున్న ఆవు ల పై దాడి చేయగా లేగ దూడ మృతి చెందిన మరో లేగ దూడను గాయపర్చింది దీంతో అక్కడి చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు చేనులోని పంట చేతికి వచ్చి ఇంటికి చేర్చుకునే సమయంలో ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

.కూలీలు రావడానికి భయపడుతున్నారని చేతికి వచ్చిన పంట పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు వబోతున్నారు సంబంధిత అధికారులు తమకు రక్షణ కల్పించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఇది ఇలా ఉంటే ప్రతి సంవత్సరం ఇదే నెలలో తరచూ పెద్ద పులుల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయ అర్ణ్యం నుంచి ఇక్కడి ప్రాంతానికి పెద్ద పులులు వస్తుంటాయి గత సంవత్సరంలో ఒక పెద్ద పులి తో పాటు నాలుగు చిన్న పిల్లలు సుమారుగా నెల రోజులపాటు అక్కడి ప్రజలను నిదుర లేకుండా చేసాయి రాత్రి వేళల్లో అక్కడి గ్రామాల యువకులు కర్రలతో కాపలాగా ఉండే పరిస్థితి నెలకొంది మళ్లీ అదే పరిస్థితి రావడంతో అక్కడికి గ్రామాల ప్రజలు బయనికి గురవుతున్నారు .

.

గత రాత్రి పెన్ గంగా రిజర్వాయర్ ప్రాంతంలో పనిచేస్తున్న టిప్పర్ డ్రైవర్ కు తంసీ కే.గ్రామం వెళ్లే రోడ్డులో టిప్పర్ పై మొహరం తరలిస్తున్న సమయం లో రోడ్డు పక్కనే పెద్ద పులి సేద తిరుతు కనిపించింది వెంటనే పెద్ద పులి ని తన చరవాణిలో ఫోటోలు తీసి పంపించారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తుంది అటవీశాఖ అధికారులు బేస్ క్యాంపులు నిర్వహించి ఎప్పటికప్పుడు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement