ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర స్ఫూర్తితో సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క 105 రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు సారధ్యంలో ఖమ్మం జిల్లా, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావిద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరుల సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మామిళ్ల గూడెం వద్ద నుండి ఘనంగా స్వాగతం పలికారు.
బుధవారం 105వ రోజు సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం మోతే నుంచి ప్రారంభమైన భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా సరిహద్దు మామిల్లగూడెం వద్దకు చేరుకుంది. సాయంత్రం నాయకన్ గూడెం మీదుగా ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. అలాగే పాదయాత్రగా వస్తున్న భట్టి విక్రమార్కకు తొలుత ఉదయం కోదాడ నియోజకవర్గం హుస్సేనబాద్ గ్రామంలో గ్రామస్తులు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.