(మారం శ్రీనివాస్)
మంచిర్యాల, ఆంధ్రప్రభ బ్యూరో: రాజ్యాంగానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ, తెలంగాణాలో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నామని ఇందులో విజయం సాధించి తీరుతామని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేత(సీఎల్పీ) మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్ళ మోడీ, కేసీఆర్ పాలనలో శుష్కవాగ్దానాలు, శూన్య హస్తాలు తప్ప ఒరిగిందేమీ లేదని ఆయన విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాళా తీయించారని పుట్టబోయే పిల్లలపై కూడా భారం మోపి వెళ్తున్నారని ఆరోపించారు. ఈ ఇరువురి పాలనతో ప్రజలు విసిగి వేసరిపోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయో రెండు పార్టీలను గద్దె దించుదామన్న పట్టుదలతో ప్రజలున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన తన పాదయాత్రకు ఎనలేని స్పందన వచ్చిందని మారుమూల గూడాలు, ఆవాస ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ గోడును వెళ్ళ బోసుకున్నారనని, దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని నినదించారని భట్టి పేర్కొన్నారు. తను ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారానికి 29వ రోజుకు చేరిందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల జిల్లా నన్పూర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ జై భారత్ సత్యాగ్రహ యాత్ర పేరుతో బహరంగ సభ నిర్వహస్తోందని ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా పార్టీ అగ్రనేతలంతా హాజరవుతున్నారని చెప్పారు.
పాదయాత్రలో ప్రజల స్పందన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా వుంది?. అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా?. గతంలో లాగానే కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీకి కొమ్ము కాస్తే పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుంది, కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు సమసినట్లేనా వంటి అంశాలపై భట్టి ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖిలో భట్టి కీలకమైన అంశాలను వెల్లడించారు. కర్ణాటకలో వచ్చే నెలలో జరుగుతున్న అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతోందని తెలంగాణలోనూ విజయం హస్తం పార్టీదే నని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం కారులో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి విశ్రాంతి తీసుకోక తప్పదని జోస్యం చెప్పారు. ముఖాముఖీ ముఖ్యంశాలివి.
ప్రశ్న: మీరు పాదయాత్ర చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటీ? ప్రజల స్పందన ఎలా ఉంది?
జ: ప్రజల సమస్యలు తెలుసుకోవడం వారిని నేరుగా ముఖాముఖిగా కలుసుకుని మాట్లా డేందుకు చేస్తున్నా. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లేక బాధపడుతున్న గిరజన, దళిత, మహళలు, మైనార్టీ స#హా పేద వర్గాలకు అండగా ఉండేందేకు పాదయాత్ర చేస్తున్నా. గిరిజన, దళిత, మ#హళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారు. వారి బాధలు, సమస్యలను నా దృష్టికి తీసుకు వస్తున్నారు. వాళ్ల తరఫున ప్రభుత్వంతో పోరాటం చేయమని చెబుతున్నారు.
ప్రశ్న: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో గెలుపు వ్యూ#హం ఏంటి?
జ: కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రాజకీయ వ్యూహాలెప్పుడూ బయటకు చెప్పం. వ్యూహాత్మకంగానే ఉంటాయి. వ్యూహాత్మక అడుగులే వేస్తాము.
ప్రశ్న: పార్టీలో సీనియర్ల మధ్య కుమ్ములాటలు?
జ: అవి కుమ్ములాటలు కానేకావు.. వర్గ విభేదాలు అంతకన్నా కావు. కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా భావస్వేచ్ఛను, భావజాలాన్ని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. భావస్వేచ్ఛను కట్టడి చేసే నియంత్రుత్వం కాంగ్రెస్‌లో లేదు. ఒక అంశంపై అందరికీ ఒకే అభిప్రాయాలు ఉండాలన్న నియంతృత్వ భావజాలం కాంగ్రెస్‌లో లేదు. దానిని గ్రూపులుగా చూడడం విచారకరం. దేశంలో ప్రజలందరికీ భిన్నాభిప్రాయలు ఉంటాయి.. అంతమాత్రాన దేశం విడిపోయినట్లు కాదు.. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కాదు. దీనిని అర్థం చేసుకోలేని కు#హనా మేధావులు కాంగ్రెస్‌పై చేసే ప్రచారాలు మాత్రమే ఇవి. ఇది కరెక్ట్ కాదు.
ప్రశ్న: టీఎస్పీఎస్పీ, టెన్త్ క్లాస్ పేపర్ లీకజీ, ధరణిపై పోరాటం ఎలా
జ: ఇప్పటికే మా పోరాటం చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలి. కొత్త వ్యక్తులను నియమించాలి. లీకేజీలకు బాధ్యలైనవారు ఎంత పెద్దవాళ్లైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాదయాత్రలో భాగంగా మంచిర్యాల వంటి మరో నాలుగు సభలు నిర్వ#హస్తాము. అందులో ఒకటి యువగర్జన పేరుతో భారీ బ#హరంగ సభ నిర్వ#హస్తాం. యావత్ కాంగ్రెస్ పార్టీ, పీసీసీ అధ్యక్షుడి నుంచి సాధారణ కార్యకర్త వరకూ.. అందరూ నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ భృతి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్లకు అండగా ఉంటుంది.
ప్రశ్న: కేసీఆర్ మళ్ళీ అధికారం మాదే అంటున్నారు?
జ: కేసీఆర్ భ్రమల్లో ఉన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారి.. చివరకు వీఆర్ఎస్ తీసుకుంటుంది. ఈ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ లేదు. ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజలు కేసీఆర్ మాయమాటలను, మోసపూరిత వాగ్దాలను నమ్మడం మానేశారు. కేసీఆర్ నయవంచనను పూర్తిగా అర్థం చేసుకున్నారు. కేసీఆర్ ఎండమావుల వంటి హామీలను ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ పూర్తిగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకూ సమాయత్తం అవుతున్నారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే.
ప్రశ్న: కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్తో పొత్తు, సీట్ల సర్దుబాటు ఉంటుందా?
జ: కాంగ్రెస్ అత్యంత బలమైన రాజకీయ పార్టీ. ఒంటరిగానే పోటీ చేస్తుంది. స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రశ్న: కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తుందా?
జ: కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజావ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. సీఎల్పీ నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర చేస్తూ.. ప్రజల్ని సమాయత్తం చేస్తున్నా. బీఆర్ఎస్పై పోరాటం చేస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను పాదయాత్రలు చేస్తున్నాం.. ప్రజలను సమాయత్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది.. ప్రజల మధ్యన ఉంటుంది.. ప్రజల కోసం ఉంటుంది.
ప్రశ్న: ఈసారి గెలిచినా గోడదూకరా? ఎలా స్పందిస్తారు?
జ: కొనుగోలు.. అమ్మకాలు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. దేశవ్యాప్తంగా బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తున్నాయి. సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలతో కలిసి కాంగ్రెస్ అధికారం పంచుకున్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభు త్వాలను కూల్చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అందుకే ఈసారి ప్రజలు మరింత కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ప్రజాస్వామ్యానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టింది. భవిష్యత్‌లో కూడా ఇలాగే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.
ప్రశ్న: విశాఖ ఉక్కును తెలంగాణ ప్రభుత్వం కొనేందుకు వ్యూ#హం రచిస్తోంది. దీనిపై మీరేమంటారు?
జ: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటినుంచీ ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తోంది. ఇక్కడున్న సంస్థలను, వ్యవస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడ్తోంది. ఇందారం ఓపెన్ కాస్ట. కోయగూడెం, తాడిచెర్ల, కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేసింది.. ఉద్యోగాలు రాకుండా.. ఆస్తులు లేకుండా చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. పేద, మధ్యతరగతి కుటంబాలకు కట్టిచ్చే హౌసింగ్ స్థలాలను అమ్మేస్తోంది.. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ.. తగుదనమ్మా అంటూ. విశాఖ ఉక్కును కొంటున్నట్లు చెబుతుంటే.. ఇది ఇక్కడ దోపిడీని డైవర్ట్ చేసే కుట్ర మాత్రమే. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ కావాలంటే.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించవచ్చు. ఇక్కడే ఐరన్ ఓర్ దొరుకుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఇది వదిలిపెట్టి.. ఎక్కడో విశాఖలో పెట్టుబడి పెడితే.. అది అక్కడి వాళ్లకే లాభం. ఇది కేవలం రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నది మాత్రమే.