Friday, November 22, 2024

Bhatti People’s March – అడుగు అడుగుకో అనుభూతి…వైఎస్సార్ స్ఫూర్తితోనే అడుగులు వేశా..

ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపించిన అడుగులు.. పౌరుషాల పురిటిగడ్డ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్జీవం పోశాయి… తెలంగాణ గడ్డపై సాగించిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భ ట్టి విక్రమార్క వేసిన ప్రతి అడుగు.. ఒక్కో సమస్యను వెలుగెత్తి చాటాయి… అడుగు అడుగున తెలంగాణ ప్రజల అభిమానం.. ఆదరణను మనసారా ఆస్వాదించానంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క.. 2023లో జరిగే అసెంబ్లిd ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ సైతం అధికార పక్షాన్ని ఢీకొడుతున్నదన్న ధీమాను ఆ పార్టీ శ్రేణుల్లో నింపారు… 110 రోజుల సుధీర్ఘ పాద యాత్రలో ఎన్నో అనుభవాలు.. ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమంటూ ప్రజలు భావిస్తున్నారని అర్థమైందంటున్నారు… తన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రపై భట్టి విక్రమార్క ఆంధ్రప్రభతో మాట్లాడారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌:

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలను వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజ లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఆశయంతో తాను చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు మరో ప్రజా ఉద్యమం సాగించాల్సిన ఆవశ్యకత కనిపించిందని ఆయన తెలిపారు. దాదాపు 110 రోజుల పాటు సాగిన పాదయాత్రను, మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లా, బోథ్‌ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలం, పిప్రీ గ్రామంలో ప్రారంభించామని, 39 నియోజకవర్గాల మీదుగా 1365 కి.మీల మేర పాదయాత్ర సాగిందన్నారు. జులై 2న ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభతో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల మద్దతు ఎలా ఉందో తెలియజేశామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ స్ఫూర్తితో నడిచిన తనకు ప్రతి అడుగులో ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపించాయని, వారి ఆక్రంధనలు వినిపించాయని భట్టి తెలిపారు. ప్రజల కన్నీళ్లు తుడిచి, కష్టాలను తీర్చే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ భుజస్కంధాలపై వేసుకుందని, లక్షల కోట్ల అవి నీతి జరిగిందంట ున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వేరు చేసే కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్‌, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. నేను కొట్టినట్లు అరుస్తా.. నువ్వు బాధ పడినట్లు ఏడువన్న చందంగా ఆ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర స్ఫూర్తితో తాను ప్రజల సమస్యల పరిష్కారానికి అడుగులు వేశానని భట్టి విక్రమార్క తెలిపారు. నాడు వైఎస్సార్‌ పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను, సమస్యలను తెలుసుకొని అధికారంలోకి రాగానే ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేందుకు ఆరోగ్యశ్రీ, సాగు విస్తీర్ణం పెంచేందుకు జలయజ్ఞం, పేదింటి విద్యార్థుల దరికి ఉన్నత విద్యను చేర్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. పోరాడి సాధించిన రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆకాంక్షలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలు గత తొమ్మిదేళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లను తాను తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెచప్పుడులో స్వయంగా విన్నానని తెలిపారు. ఒక్కోసారి వారి బాధలు వింటుంటే, వారి కన్నీటి గాథలు చూస్తుంటే కన్నీరొచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ ప్రజలకు సర్వ రోగ నివారిణి అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమస్యలేని గ్రామం, బాధలేని గుండె లేదన్న భట్టి, బంగారు తెలంగాణా పేరిట కల్వకుంట్ల కుటుంబం అభూత కల్పనను ప్రజల నెత్తిన పెడుతోందన్నారు.

సీఎం ఏనాడైనా గ్రామాలకు వెళితే వాస్తవాలు బయట పడేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టు-కుంటామని, అధిష్టానం అనుమతితో సీఎల్పీ నేతగా ప్రజలకు హామీలనిచ్చానని స్పష్ట ం చేశారు. తరతరాలుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న త్యాగాలు వెల కట్టలేనివని, ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. అధికారంలోకి వచ్చాక, త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టు-కుంటామని హామీ ఇచ్చారు. తనతో కలిసి ప్రజల తెలంగాణ ప్రజల స్థి తిగతులను పరిశీలించేందుకు పాదయాత్రలో అడుగులు వేసిన ప్రతి ఒక్కరికీ, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. తన పాదయాత్ర విజయవంతం కావడంలో కుటు-ంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌ సైనికుడిగానే పోరాడుతానని, కాంగ్రెస్‌ పార్టీ త్యాగంతో ఏర్పడిన తెలంగాణాలో అధికారంలోకి రావడంతో పాటు, దేశ ప్రధానిగా రాహుల్‌ గాంధీని కూర్చొబెట్టడమే లక్ష్యంగా ముం దుకు సాగుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement