Friday, November 22, 2024

సమస్యల సుడిగుండంలో తెలంగాణ – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రిసమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం చిక్కుకున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాజపేట మండలం రఘునాథపురం గ్రామం నుంచి యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి మాసాయిపేట, సైదాపురం, మీదుగా యాదగిరిగుట్ట వరకు కొనసాగింది. ఈ సంధర్బంగా మాట్లాడుతూతెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను నోర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 47వ రోజు కొనసాగిన భట్టి చేపట్టిన పాదయాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామ గ్రామాన మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి వీర తిలకం దిద్దారు.

ప్రజలను కలుస్తూ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు. ర‌ఘునాథ‌పురంలోపవర్లూమ్ కార్మికుడు ఆడెం శివ పాదయాత్రకు ఎదురుగా వచ్చి తన ఇంట్లో పవర్ లూమ్స్ పైన తయారవుతున్న బట్టల గురించి వివరించారు.మరమగ్గం నడిపించే విధానాన్ని చూపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే నేత కార్మికుల‌ను ఆదుకుంద‌ని చెప్పారు. అప్పుడే నేత కార్మికులు వాడే మ‌ర‌మ‌గ్గాల‌కు విద్యుత్ బిల్లుల‌పై స‌బ్సిడీని ఇచ్చార‌ని గుర్తు చేసుకున్నారు.

ప్ర‌స్తుతం మాకు రైతుల‌కు ఇచ్చిన‌ట్లుగా ఉచిత్ విద్యుత్ ఇవ్వాల‌ని కోరారు. చేనేత వ‌స్త్రాల కోసం కొనే ముడిస‌రుకులు, త‌యారైన వ‌స్త్రాల‌పై రెండు విధాలుగా జీఎస్టీ వేయ‌డం వ‌ల్ల ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని.. వాపోయారు. అంతేకాక ముడిస‌రుకు కొనుగులుపై స‌బ్సిడీ ఇవ్వాల‌ని అడిగారు. ధ‌నిక రాష్ట్ర‌మైన ప్ర‌త్యేక తెలంగాణ పాల‌న‌లో క‌న్నా.. నాటి ఉమ్మ‌డి రాష్ట్ర కాంగ్రెస్ పాల‌నే బాగుంద‌ని చెప్పారు

మాసాయిపేట‌లోని ఐకెపి కేంద్రం వద్ద తడిసిన ధాన్యం చూపించి రైతులు క‌న్నీరు మున్నేరుగా విల‌పించారు. మా క‌ష్టం చూడాలంటూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. దాదాపు 10 రోజుల కింద కొనుగోలు కేంద్రం తెరిచినా .. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క క్వింటా కూడా తూకం వేయ‌లేద‌ని రైతు క‌ళ్లెం మ‌ల్ల‌య్య క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతూ చెప్పారు. అకాల వ‌ర్షానికి ధాన్యం త‌డుస్తూ.. ఎండ‌బెడుతూ.. రాత్రింబ‌వ‌ళ్లు కోనుగోలు కేంద్రం వ‌ద్దే ప‌డిగాపులు కాస్తున్నట్లు క‌న్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌ను గోస పెడ్తోందంటూ ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల కోసం, ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అందించార‌ని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఆలేరుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించారు. సకల సమస్యలకు తెలంగాణ వస్తే పరిష్కారమని భావించి మనం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ లక్ష్యాలకు అడ్డుగా ఉన్న కేసీఆర్ తొలగించుకుని ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement