Friday, November 22, 2024

ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం – భట్టి విక్రమార్క

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రిఆత్మహత్యలు లేనటువంటి చేనేత కార్మికుల జీవితాలను చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా రానున్న ఇందిరమ్మ రాజ్యంలో చేనేత రంగానికి పెద్ద పీట వేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోనిభూదాన్ పోచంపల్లి మండలంలో కేంద్రంలో చేనేత సమస్యలపై దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ధనిక రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇవ్వాల్సిన సబ్సిడీ రాయితీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో విధానం తీసుకువచ్చి అనేక కొర్రీలు పెట్టడం దుర్మార్గమని, జియో టాకింగ్ పేరుతో రాష్ట్రంలో కేవలం 17 లక్షల మంది చేనేత కార్మికులు మాత్రమే ఉన్నారని తక్కువ చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో చేనేత కార్మికులకు 350 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకువచ్చిన పాలకులు తలదించుకోవాలన్నారు. చేనేత ఆకలి చావులు వారి సమస్య కాదని అది సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోకుంటే సమాజానికి పెద్ద నష్టమని భావించిన స్వర్గీయ వైయస్సార్ అనేక సబ్సిడీలు తీసుకొచ్చారని వెల్లడించారు. చేనేతరంగాన్ని వ్యాపార కోణంతో చూడకుండా నాగరికత అంశంగా ప్రభుత్వం గుర్తించి వారికి అందివ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహాలు జాప్యం జరగకుండా ఇవ్వాలన్నారు. చేనేత నూలుపై కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టి 18 శాతం, రాష్ట్ర ప్రభుత్వ విధించే నాలుగు శాతం పన్నులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రైతు భీమా తరహా లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత బీమా పథకం తీసుకొస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదని అడిగినందుకు చేనేత సొసైటీ పాలకవర్గ సభ్యులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.——————-

కనీస వేతన చట్టం అమలు చేయకపోవడంలో నిర్లక్ష్యంపార్లమెంట్లో చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం పెద్ద నేరంగా భావించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని శాంతియుతంగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

యాదాద్రి లో ముగిసిన పీపుల్స్ మార్చ్

- Advertisement -

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పోచంపల్లిలో 51వ రోజు కొనసాగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేనేత సమస్యలపై చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. చేనేత కార్మికులు పడుతున్న శ్రమ, చేనేత మగ్గాలు, చీరలు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేస్తు పరిశీలించారు. శ్యామ్ ఇంట్లో మూడు చీరలను ప్రియాంక గాంధీ కి బహుకరణ చేయడానికి ఖరీదు చేశారు. పోచంపల్లి నుంచి బాటసింగారం వరకు కొనసాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. దారి పొడవున సమస్యలు ఆలకిస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఏప్రిల్ 30న ఆలేరు నియోజక వర్గంలో ప్రారంభమై ఆలేరు, రాజాపేట, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో పర్యటించి ఇబ్రహీంపట్నం నియోజక వర్గానికి చేరుకుంది.————–

Advertisement

తాజా వార్తలు

Advertisement