మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ కు భారతరత్నఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మన్మోహన్ సింగ్ మృతిపై అసెంబ్లీ సభ్యులు సంతాపం ప్రకటించారు. దేశానికి ఆయన సేవలను అసెంబ్లీ వేదికగా కొనియాడారు. మన్మోహన్ సింగ్ తెలంగాణ ఆత్మబంధువులని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని, సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మహబూబ్ నగర్ నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -