Friday, November 22, 2024

TG: అదానీపై కాంగ్రెస్ భ‌గ్గు… హైద‌రాబాద్ లో ర్యాలీ…

ఈడీ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా
సెబీ ఛైర్ ప‌ర్సన్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్
ఈ వ్య‌వ‌హ‌రంపై జెపిసి వేయాల‌ని ప‌ట్టు

హైదరాబాద్‌: అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. తొలుత హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ధ‌ర్నా చేప‌ట్టారు. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. అక్క‌డే నిర‌స‌న కొన‌సాగించారు. ఈ ఆందోళనలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేక్ వెంకట స్వామి, జయవీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాగా, సెబీ చీఫ్‌ మాధబీ పురీ బచ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేశారు. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు మాధబీపై ఇటీవల హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. దీంతో పాటు అదానీ సంస్థలపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈడీ కార్యాలయాల వద్ద నేతలు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగానే తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement