Monday, July 1, 2024

TS : రూ.30కోట్లతో భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక.. కమిషనర్

మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు
ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం..
దేవాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు
భద్రకాళి ఆలయంలో పూజలు
అభివృద్ధిపై అర్చకులతో చర్చించిన కమిషనర్
వరంగల్ : రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ, ధర్మాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. శనివారం ఉదయం వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు కమిషనర్ కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వేదమంత్రోశ్చ‌రణాల మధ్య ఆశీర్వచనలు ఇచ్చారు. కమిషనర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కమిషనర్ కు ప్రసాదం అందజేశారు. అనంతరం దేవాలయం అభివృద్ధిపై కమిషనర్ అర్చకులతో చర్చించారు.

ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని అర్చకులు, ఆలయ అధికారులు కమిషనర్ ను కోరారు. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ మాట్లాడుతూ… రూ.30కోట్ల నిధులతో భద్రకాళి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం ఆలయం పక్కన ఉన్న భూమిని పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జే రాములు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కిరణ్మయి, దేవాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement