Saturday, November 23, 2024

భ‌ద్రాద్రి, యాదాద్రికి పోటెత్తిన భ‌క్తులు

రాష్ట్రంలోని యాదాద్రి, భ‌ద్రాద్రి పుణ్య‌క్షేత్రాల‌కు భ‌క్తులు పోటెత్తారు. కార్తీక‌మాసం, ఆదివారం కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. భ‌ద్రాచ‌లంలో తెల్ల‌వారుజాము నుంచే స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు.

యాదాద్రి శ్రీల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. స్వామి వారి ధ‌ర్మ ద‌ర్శ‌నానికి 2 గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి గంట స‌మ‌యం ప‌డుతోంది. భ‌క్తులు అధికంగా స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి ప‌నుల దృష్ట్యా కొండ‌పైకి వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement