భద్రాద్రి రామాలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఇకపై భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి. రూ. 100 క్యూలైన్లలో ఉచితంగా ప్రవేశించవచ్చు. తద్వారా రామయ్యను ఉచితంగా దర్శించుకోవచ్చు.
- Advertisement -
అయితే, ఇక్కడ ఒక కండీషన్ ఉంది. ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఈ ఉచిత దర్శనం అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో యధావిధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు.