Sunday, September 15, 2024

Bhadradri Kothagudem – సీతారామ ప్రధాన కాలువకు భారీ గండి…

అశ్వరావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పై నిర్మించిన సీతారామా ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉల్కలపల్లి మండలంలో భారీ గండి పడింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా ములకలపల్లి మండలం వీకే రామవరం పంప్ హౌస్ 2 సమీపంలో ఈ గండి పడి నీరు బయటకు ప్రవహిస్తుంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూములు నీటి ప్రవాహానికి గురై కొట్టుకుపోయాయి. ప్రధాన కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యతను ఈ ఘటన ప్రశ్నించేలా ఉందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు పడిన గండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ఖమ్మంలో మున్నేరు ఉదృత ప్రవాహం.. –

సహాయం కోసం పలువురు ఎదురుచూపులు..
-డాబాలపై సహాయం కోసం పలువురు నిరీక్షణ..

ఖమ్మం జిల్లా కేంద్రం లో మున్నేరు నది వెంబడి కరుణగిరి చర్చి ఎదురుగా పలు ఇండ్లు వరదలో చిక్కుకున్నాయి. బ్రిడ్జి సమీపంలోని వాటర్ ట్యాంక్ పక్కన ఆకుల కార్తీక్ కుటుంబం మొదటి అంతస్తు మొత్తం నీళ్లలో మునిగిపోయి డాబా పైకి ఎక్కి చిన్నపిల్లలతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా పలువురు సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వరద పక్కనే ఉన్న ఇళ్లల్లోకి చేరుకుంది. నేటి వరకు అధికారులు, యంత్రాంగం ఎవరు స్పందించడం లేదు. బోట్లు లేవు సిబ్బంది లేవని అధికారులు స్పందించడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement