భద్రాచలం (టౌన్) నవంబర్ 9 (ఆంధ్రప్రభ) : భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు. పట్టణంలో గురువారం టిడిపి పార్టీ నాయకులు కోడలి శ్రీనివాస్ నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరయ్యకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్జన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం అభివృద్ధికి 1100 కోట్లు ప్రకటించి 11 రూపాయలు ఇవ్వలేదని మండిపడ్డారు. భద్రాచలం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమావేశానికి విచ్చేసి టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో షేక్ అజీమ్, ఖమ్మంపాటి సురేష్, కుంచాల రాజారాం, కోనేరు రాము, అభినేని శ్రీనివాస్, తాళ్లూరి చిట్టిబాబు, రాఘవయ్య, అడుసు మల్లి జగదీష్ ,మేడిపల్లి మల్లికార్జునరావు, కోడూరి సత్యనారాయణ, పరిమి సుబ్బారావు, పరిమి సోమశేఖర్, చారు గుండ్ల నాగేశ్వరరావు , పోటు వెంకటేశ్వరరావు, దాసయ్య. బోడిపూడి కృష్ణమూర్తి , బోడిపూడి శ్రీనివాస్, హరీష్, చిన్ను , కొడాలి చంటి తదితరులు పాల్గొన్నారు