Tuesday, November 19, 2024

Bhadrachalam: పెరుగుతున్న గోదావ‌రి… పున‌రావాస కేంద్రానికి నిర్వాసితులు

52 అడుగుల వద్ద గోదావరి
-తూరుబాక వద్ద రోడ్డుపైకి వరదనీరు
-పర్ణశాల వద్ద అదే పరిస్థితి
-పునరావాసు కేంద్రానికి 12 కుటుంబాలు

భద్రాచలం, జులై 27 (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నేటి ఉదయం 11 గంటలకు 52.0 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు అడుగు దూరంలోనే ఉంది. ఇదిలా ఉండగా భద్రాచలం ఏజెన్సీకి ఎగువన ఉన్న కాలేశ్వరం, పేరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. దుమ్ముగూడెం వద్ద తగ్గుముఖంలో, భద్రాచలం వద్ద పెరుగుతూ ఉంది. నేటి సాయంత్రం నుంచి గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

భద్రాచలంలోని పట్టణ సరిహద్దులో ఉన్న ఏఎంసీ కాలనీలోనికి వరద నీరు చేరింది. పట్టణ బ్యాక్ వాటర్, ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలనీలోకి మురుగునీరు వెనుకకు పారుతుంది. దీంతో సుమారు 30 ఇల్లు ముంపునకు గురైనాయి.

ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇదే క్రమంలో పర్ణశాల సబ్ స్టేషన్ వద్ద రోడ్ పైకి, దుమ్ముగూడెం మండలం తూరుబాక బ్రిడ్జి దగ్గర రోడ్డు పైకి గోదావరి వరద నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో అంతరాయం కలిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement