తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపధ్యంలో “తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement