Monday, September 16, 2024

రాష్ట్రంలోనే బెస్ట్‌ పోలీసింగ్

  • టాప్‌ 30లో రెండు స్థానాలు
  • 6వ స్థానంలో బసంత్‌నగర్‌ పీఎస్‌
  • 23వ స్థానంలో పెద్దపల్లి

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 5 (ప్రభన్యూస్‌): రాష్ట్రంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రభుత్వం పోలీసులను ప్రజలకు చేరువగా తీసుకు వెళ్తోంది.. అయినా కూడా కొన్ని చోట్ల కొంతమంది పోలీసుల తీరు వల్ల పోలీస్‌ స్టేషన్‌ అంటేనే వణుకు పుట్టించే పరిస్థితులున్నాయి.. ఇలాంటి తరుణంలో పోలీస్‌ శాఖ పనితీరులో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ర్యాంకింగ్‌లో రామగుండం కమిషనరేట్‌లోని పెద్దపల్లి సర్కిల్‌ పరిధిలో రెండు పోలీస్‌ స్టేషన్లు బెస్ట్‌గా నిలిచాయి.

రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో పోలీసుల పనితీరును పరిగణలోకి తీసుకొని టాప్‌ 30 పోలీస్‌ స్టేషన్‌లను ఎంపిక చేశారు. అందులో పెద్దపల్లి సర్కిల్‌ పరిధిలోని బసంత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు 6వ స్థానం, పెద్దపల్లి పోలీస్‌ స్టేసన్‌కు 23వ స్థానం దక్కింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతోపాటు స్పీడీ డిస్పోజల్‌ను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్‌ ఇచ్చారు. కేసుల నమోదు, ప్రాపర్టీ రివకరీ ఇతర అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని బెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లను ఎంపిక చేశారు. ఒకే సర్కిల్‌లోని రెండు పోలీస్‌ స్టేషన్లు బెస్ట్‌గా ఎంపిక కావడం పట్ల రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. పద్దపల్లి డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, ఏసీపీ ఎడ్ల మహేశ్‌, సీఐ అనిల్‌ కుమార్‌, బసంత్‌నగర్‌ ఎస్‌ఐ వెంకటేశ్‌, పెద్దపల్లి ఎస్‌ఐ మహేందర్‌లను అభినందించారు. టాప్‌ 30లోగా రెండు బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లుగా ఎంపిక కావడంతో పోలీసుల పట్ల అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement