Monday, November 25, 2024

TS: బెల్ట్ షాపులు తొలగించాలి.. సీఎంకు జీవన్ రెడ్డి లేఖ

అనుమతులు లేకుండా గ్రామాల్లో అక్రమంగా నిర్వహించబడుతున్న బెల్ట్ షాపులని తక్షణమే తొలగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ అంశంపై ఆయన గురువారం కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిందన్నారు. ఉద్యమ‌ లక్షణాలని నీరు కార్చారన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజుల్లోనే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అరోగ్యశ్రీ ని కొనసాగింపు నిర్ణయం, మహిళలకు అర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలనడం హర్షణీయమన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఆదాయశాఖగా మారిందని, గత ప్రభుత్వం మద్యాన్ని అదాయ మార్గంగా ఎంచుకొని మద్యానికి బానిసగా చేసిందన్నారు. ప్రతి గ్రామంలో‌ పదికి పైగా బెల్ట్ షాపులు ఉంటాయని, బెల్ట్ షాపులు మూసివేయడానికి తక్షణమే అదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ వ్రాసినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement