Sunday, September 15, 2024

TG: ఉత్తమ్ సీఎం కావ‌డం త‌థ్యం… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయి.. తప్పనిసరిగా భవిష్యత్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయ్యారు.

ప్రాజెక్టుల మంత్రి కావడం మన అదృష్టం. బునాదిగాని, పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని, కాలువల వెడల్పు పెంచితే దీని ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందన్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూర దృష్టితో ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రాజెక్టుల‌పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement