హైదరాబాద్ – తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ యు టర్న్ తీసుకుంది.. రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో చర్చలు జరిగిన తర్వాత సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ హామీ ఇచ్చింది. వినియోగదారులు, కార్మికులు, వాటదారులు ప్రయోజనం దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్ధ పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
- Advertisement -