సిరికొండ, ఆగస్టు 7 ( ప్రభ న్యూస్ ): మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక బీడీ కార్మికురాలు గంగాజమున తన కుమారుడు ఎస్సై ఉద్యోగం సంపాదించాడని తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సిరికొండ మండలం కొండూర్ గ్రామానికి చెందిన గంగాజమున కుమారుడు కడుపులో ఉన్నప్పుడే తాళి కట్టిన భర్త ఒంటరి దాన్ని చేసి బొంబాయి చెక్కేశాడు. అప్పటి నుంచి తనకు జన్మించిన కుమారున్ని ఉన్నత స్థానంలో చూడాలనే తపనతో బీడీల వృత్తి పై ఆధారపడి వచ్చిన డబ్బులతో కొడుకును చదివించింది. ఆదివారం సివిల్ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది టిఎస్ఎల్పిఆర్బి ప్రకటించిన ఫలితాల్లో తన కుమారుడు రాజు ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన విషయం తెలిసి రాజు తల్లి గంగా జమున, భార్య పిల్లల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన రాజు ప్రభ న్యూస్ తో మాట్లాడుతూ,. అమ్మ నన్ను చదివించడానికి ఎన్ని కష్టాలు అనుభవించిందో నేను కళ్లార చూశానని అన్నారు. సమాజంలో నలుగురు చెప్పుకునే ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో 2010 సంవత్సరంలో బి టేక్ పూర్తి చేశానని,. అనంతరం 2017 సంవత్సరంలో ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొపెసర్ గా కొన్ని నెలలు విధులు నిర్వహించనన్నారు.. అదే సంవత్సరంలో పోలీసు శాఖకు చెందిన కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా చేరానని వెల్లడించాడు. .2021 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందానని తెలిపాడు. సివిల్ ఎస్సై ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం వెలువడించడంతో. ఎలాగైన ఎస్సై ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో కష్టపడ్డానని,. ఆదివారం ప్రకటించిన సివిల్ ఎస్సై ఫలితాల్లో తను ఎంపికైనట్లు తెలిసి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రాజు చెప్పాడు.