సూర్యడు తన ఉగ్ర రూపాన్ని చూపుతున్నాడని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ఇవాళ ఆమె వరంగల్ జిల్లాలో లోకసభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని.. ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సీతక్క ప్రజలకు తెలిపారు.
- Advertisement -
కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని చెప్పారు గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని… ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని మంత్రి చెప్పారు. పెరగుతున్న ఉష్ణోగ్రతలు.. వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితమై నీడపట్టున ఉండాలన్నారు.