Friday, November 22, 2024

ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త : సీపీ రంగనాథ్

వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ విభాగం రూపొందించిన కరపత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో గురువారం అవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చోరీల నివారణకు ప్రజలకు పలు సూచనలు చేసారు.

  • ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును భద్రపర్చుకోవాలని.
  • బీరువా తాళాలు ఇంటిలోనే ఉంచకుండా తమవెంట తీసుకొని పోవాలి.
  • ఎక్కువ రోజులు విహార యాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని సూచించాలి. పనిమనిషి ఉంటే రోజు ఇంటి ముందు శుభ్రం చేయమనాలి.
  • విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పరాదు.
  • ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చు.
  • ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదు, లోపలి నుండి బేడం పెట్టాలి.
  • ఇంటిలోపల, బయల లైటు వేసి ఉంచాలి.
  • అపార్ట్ మెంట్ లో సిసి కెమెరాలు లేదా వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలి.
  • సంబంధిత పోలీస్ స్టేషన్, ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లు దగ్గర వుంచుకోవాలి.

ప్రజలు పోలీసులు సమన్వయం కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించుకోగలము. ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. ఎవరైన కాలనీలోని, ఆపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కోత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే స్థానిక లేక డయల్ 100, వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 8712685294. క్రైమ్ డిసిపి నంబర్ 8712685103, క్రైమ్ ఏసిపి నంబర్ 8712685135, సిసిఎస్ ఇన్ స్పెక్ట‌ర్ 8712685136. సమాచారం అందించగలరని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమములో క్రైం డిసిపి మురళీధర్, ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్, క్రైం ఏసిపి డేవిడ్ రాజు.. కాజీపేట ఏసిపి శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి తిరుమల్, సిసిఎస్ ఇన్స్స్పెక్టర్ రమేష్ కుమార్ పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement