Wednesday, January 29, 2025

ADB | బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి.. కేఏ పాల్

నిర్మల్ ప్రతినిధి, జనవరి 27 (ఆంధ్రప్రభ ) : ఓట్లు మనవి, అధికారం మాత్రం రెండు వర్గాలకే పరిమితమైంది.. ఇప్పటికైనా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు మేలుకొని బీసీలను రాజ్యాధికారం చేసే విధంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలన పోవాలి.. పాలన రావాలి.. మాజీ సర్పంచులతో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం ఉన్న రావులు, ఐదు శాతం ఓట్లు ఉన్న రెడ్డిలు రాజ్యాధికారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకతాటి పైకి వచ్చి బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా పోరాడాలని, అందుకు వేదికగా రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రజా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు నిధులు కేటాయిస్తానని ఆయన ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులకు హామీ ఇచ్చారు.

78ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి దేశానికి చేసిందేమీ లేదని, అదే పంథాలో బీజేపీ పార్టీ సైతం నడుస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను నడిరోడ్డున పడేశారని, ఒక్కొక్క‌రి తల మీద కోటి రూపాయల అప్పు చేశారని, రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, అప్పుల వడ్డీలకే సరిపోతుందని, దేశం ఎలా ముందుకు పోతుందని ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు.

ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ 11ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్ నిధులతో పనులు చేస్తే ఇప్పటికీ వాటి బిల్లులను గత ప్రభుత్వం టిఆర్ఎస్. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు ఇవ్వడం లేదని దుయబట్టారు.. ఈ సందర్భంగా పలువురు మాజీ సర్పంచులు తమ గోడును కేఏ పాల్ ముందు వెళ్ళబోసుకున్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు నిర్మించామని, బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మాజీ సర్పంచుల ఆందోళన కార్యక్రమాలకు ప్రజాశాంతి పార్టీ ఎప్పుడూ అండ‌గా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement