హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-3, 4 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అర్హులైన బీసీ అభ్యర్థులకు రాష్ట్రంలోని 50 బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచితంగా ఆఫ్‌లైన్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు (15వ తేదీ) నుంచి 17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత, కుల, ఆదాయ ధృవీరణ నకళ్ల పత్రాలను సమీపంలోని స్టడీ సెంటర్లలో సమర్పించాలని తెలిపారు. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు బీసీ స్టడీ కేంద్రాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.