Tuesday, November 26, 2024

BC Meeting – కాంగ్రెస్ నాయకత్వంలోనే బీసీలకు రాజ్యాధికారం… వి.హెచ్ హనుమంతరావు

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (ప్రభ న్యూస్)16: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే బీసీల కు రాజ్యాధికారం దక్కు తుందని, బీసీలకు న్యాయం జరుగుతుందనిబీసీ డిక్లరేష న్ కమిటీ చైర్మన్, మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హెచ్ హనుమంత రావు అన్నారు. ఐక్యతతోనే ఏదైనా సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ ఏకతాటిపై వచ్చి తమ హక్కులను సాధించుకో వాలంటే పోరాడాల్సిన సమయం ఆసన్నమైనదని పిలుపునిచ్చారు. తెలంగాణను ఇచ్చిన నిజమైన తెలంగాణవాదులు కాంగ్రెస్ పార్టీ యేనని అన్నారు.

జిల్లాలోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బీసీ గర్జన సన్నా హక సమావేశానికి బీసీ డిక్లరేష న్ కమిటీ చైర్మన్, మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హెచ్ హను మంతరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారతదే శంలో మోడీ తనకు తాను ఓబీసీ అని అనుకుంటున్నాడనీ అన్నారు. దేశంలో 56% బీసీలు ఉంటే బీసీలకు ఎలాంటి న్యా యం జరగలేదని వాపోయా రు. రాహుల్ గాందీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాద యాత్ర చేసి వోబిసిల సమస్యలు తెలుసు కున్నారనీ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు బిసీల సంక్షేమ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ దళిత బంధు పేరుమీద మోసం చేస్తున్నారని ఆరోపిం చారు.

ఎందరో మంది తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నారని సోనియాగాంధీ పెద్ద మనసు చేసుకొని తెలంగాణను ఇచ్చిం దని పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబట్టుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ దే అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలా అబద్ధాల మాటలు చెప్పమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. అనంతరం సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడిన గద్దర్ ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ,మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్,రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి ,పీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్ బీన్ హందాన్ ,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగా ధర్ ,పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ,మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సా రెడ్డి ,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్య క్షులు అన్వేష్ రెడ్డి బాన్స్ వాడ ఇంఛార్జి కాసుల బాలరాజ్ అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. హను మంతరావుని యువజన నాయకులు కాంగ్రెస్ నాయ కులు శాలువా తో ఘనంగా సన్మానించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement