Saturday, January 4, 2025

BC Conclave – బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే – అర్ . కృష్ణయ్య మాస్ వార్నింగ్

హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచకపోతే యుద్దమే జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నీల వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 30 బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, 39 కుల సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తరువాత రిజర్వేషన్లు పెంచితే న్యాయపరమైన చట్ట పరమైన అవరోదలు యుండవన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదు. ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది. అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజులలో లోక్ సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు. కాని 50 శాతం జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా! మన దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు.

- Advertisement -

అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా యున్నవి. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని తెలిపారు.

ఈ సభలో డా.అరుణ్ కుమార్, నీల వెంకటేష్, గొరిగే మల్లేశ్, గుజ్జ సత్యం, జిల్లాపల్లి అంజి, వేముల రామకృష్ణ, పృధ్వీ గౌడ్, సతీశ్, అనంతయ్య, జయంతి, రమాదేవి, రాజేందర్, రఘుపతి, మోడి రామ్ దేవ్, ఉదయ్ నేత, మనిజ్, పరుషారామ్, నిఖిల్, వీరన్న, కీర్తి లతా, ఆరాజ్ కుమార్, అశోక్, దుడుగు లక్ష్మి నారాయణ, కరుణా, అరుణ జ్యోతి, లక్ష్మి, శ్యామ్ , టి. మురళీధర్ స్వామి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement